నేడు
అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు(State Formation Day) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నవంబర్ 1న ఏర్పాటు కావడంతో ఆయా రాష్ట్రాల
పౌరులకు ప్రధానమంత్రి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్ లో కొనియాడిన ప్రధాని, అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన
సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు,
విజయం కోసం నిరంతరం ప్రార్థిస్తానంటూ ట్వీట్ లో ప్రధాని రాశారు.
కర్ణాటక
అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రధాని అభినందనలు తెలిపారు.
కన్నడ రాజ్యోత్సవంలో కర్ణాటక స్ఫూర్తి వెల్లివిరుస్తోందన్నారు. కన్నడిగుల మంచి
మనస్సు, తెలివితో ఆ రాష్ట్రం గొప్పగా ముందుకు సాగుతోందన్నారు. నూతన ఆవిష్కరణలు,
అభివృద్ధిలో మరింత స్ఫూర్తిదాయకంగా కర్ణాటక ప్రస్థానం సాగాలంటూ ట్వీట్ లో
కొనియాడారు. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రజలకు కూడా రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు
తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి, సీఎం క్యాంపు ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగుతల్లి,
అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.