క్రికెట్
ప్రపంచకప్(CWC) -2023 టోర్నీలో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్
గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్(BANGLADESH)తో
జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్(PAKISTAN)
ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లా టీమ్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని
ఛేదించడానికి బరిలోకి దిగిన పాక్ జట్టు 32.3 ఓవర్లలకు మూడు వికెట్లు కోల్పోయి 205
పరుగులు చేసి విజయం సాధించింది.
పాకిస్తాన్
జట్టు ఓపెనర్లు ఫకర్ జమాన్ 74 బంతుల్లో 81 పరుగులు చేయగా, అబ్దుల్లా షఫీక్ 69
బంతుల్లో 68 రన్స్ చేసి తొలి వికెట్ కు 128 పరుగులు జోడించి
పాక్ విజయానికి బాటలు వేశారు.
కెప్టెన్ బాబర్ అజామ్ (9) స్వల్ప స్కోరుకే
వెనుదిరిగి నిరాశ పరిచినప్పటికీ… మహ్మద్ రిజ్వాన్ (26 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (17 నాటౌట్) మరో వికెట్
పడకుండా మ్యాచ్ ముగించారు.
బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు
తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 45.1 ఓవర్లకు 204 పరుగులు చేసి ఆలౌటైంది.
బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(70 బంతుల్లో 56 పరుగులు) టాప్ స్కోరర్ గా ఉన్నారు.
పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం తలా మూడు వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్
2, ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో
వికెట్ పడగొట్టారు.
బంగ్లాదేశ్‌పై ఘనవిజయంతో పాక్ తిరిగి
సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. 6 పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుంది. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా కంటే
రెండు పాయింట్లు మాత్రమే వెనుకంజలో ఉంది.