Nagam and PJR son joins
BRS
సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ
ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్లో చేశారు. హైదరాబాద్లోని
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి
సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి సుపరిపాలనలో భాగస్వాములయేందుకు నాగం
జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలను పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిలో తోడు నిలవాలని కోరినట్లు పేర్కొన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తుకు
కేసీఆర్ భరోసా ఇచ్చారు. నాగం జనార్దన్ రెడ్డి, తానూ కలిసి అనేక పోరాటాలు చేసామన్నారు. జూబ్లీహిల్స్లో
పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈసారి
పాలమూరులో మొత్తం 14 స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్ధులే గెలవాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్
రెడ్డి ప్రాణాలు తీసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారని
కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ను గెలిపించడం
ద్వారానే అలాంటి శక్తులకు బుద్ది చెప్పాలన్నారు.