స్కిల్ స్కాం(skill scam)లో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదుల అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పునిచ్చారు. లక్షపూచీకత్తు, ఇద్దరు జామీనుతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.పూర్తి స్థాయి బెయిల్ పిటీషన్‌పై నవంబరు 10వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.తరువాత ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా…న్యాయస్థానం రిమాండ్ విధించింది. 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించడంతో, ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.