ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2న ఢిల్లీ ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు.
నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం ( prevention of monedy lanudering act) నిబంధనల కింద సమన్లు జారీ చేసినట్లు ఈడీ (ED) అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపొందించే క్రమంలో డీలర్లకు భారీ ప్రయోజనం చేకూరేలా విధానాలు రూపొందించారని, అందుకు ప్రతిగా కమీషన్లు పొందారని ఆప్ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా తీహార్ జైలులో రిమాండులో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన మరునాడే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఆప్‌ను లేకుండా చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు.