స్కిల్ స్కామ్ (Skill Case )లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో వేసిన మధ్యంతర బెయిల్ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. మంగళవారంనాడు మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ప్రధాన బెయిల్‌పై వాదనలు ఎప్పుడు మొదలవుతాయనేది మంగళవారం తేలనుంది.
స్కిల్ స్కామ్‌లో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూధ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించాల్సి ఉందని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న
న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.