మహారాష్ట్రలో మరాఠా కోటా అంశంపై ఎమ్మెల్యే ప్రకాశ్ సొలంకే వ్యాఖ్యలు హింసకు దారితీశాయి. కోటాకు అనుకూలంగా మనోజ్ జరంగే పాటిల్ ఈ నెల 25 నుంచి
నిరాహార దీక్ష చేస్తున్నారు. అతనికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే చేసిన వ్యాఖ్యలతో పాటిల్ మద్దతుదారులు రెచ్చిపోయారు. బీడ్ జిల్లాలోని సోలంకే ఇంటికి నిప్పుపెట్టారు. అయితే ఈ ఘటన నుంచి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు బయటపడ్డారు. పలు వాహనాలు దహనం చేశారు.
కోటా అమలు చేయడానికి ప్రభుత్వానికి 40 రోజుల గడువుంది. కొందరికి ఇది పిల్లల ఆటగా మారిందంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో నిరసనకారులు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు.గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూడా గెలవని వ్యక్తి నేడు హీరో అయ్యాడంటూ పాటిల్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హింసకు దారితీశాయి.
ఈ ఘటనపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. మా ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెడుతుంటే రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండా మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పవార్ డిమాండ్ చేస్తున్నారు.