మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ బరిలో దిగారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తుండగా ఆయనపై దాడి జరిగింది. దుండగుడు కత్తితో కడుపులో పొడవడంతో ఎంపీని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
సూరంపల్లిలో పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. దాడి తరవాత ఎంపీని ముందుగా గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.దుండగుడిని అాదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.