రెండు
రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్(Gujarat)
లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ(PM MODI),
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మరికొన్ని కార్యక్రమాలకు భూమి పూజ
చేశారు. దాదాపు రూ. 5,800 కోట్ల రూపాయల విలువ చేసే పనులుకు మెహసానాలో అంకురార్పణ
చేశారు.
రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు.
చిక్లాలోని
అంబాజీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ప్రధానికి
అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. దాదాపు అరగంటపాటు శక్తిపీఠంలో గడిపిన
మోదీ, అమ్మవారికి హారతి ఇచ్చారు.
గత
ఏడాది అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని, అనంతరం ఓ సభలో మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని
హామీ ఇచ్చారు. ధారోయ్ డామ్ నుంచి అంబాజీ వరకు ఈ మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధి
చేస్తానని చెప్పారు. ఐక్యతా విగ్రహం ఉన్న ప్రాంతంలాగే ఈ ప్రాంతాన్ని కొత్త పుంతలు
తొక్కిస్తానన్నారు. హామీ మేరకు ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు
జరుగుతున్నాయి.
మెహసానా జిల్లాలోని ఖేరలులో పర్యటించిన మోదీ, రూ.
4,778 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
సందర్భంగా నిర్వహించే రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాల్లో రేపు పాల్గొని ఉక్కుమనిషికి
నివాళులు అర్పించనున్నారు.