తిరుమల(TIRUMALA) శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవాలను
నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ(TTD) చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
పద్మావతి
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్లెట్స్ విడుదల చేసిన టీటీడీ చైర్మన్
కరుణాకర రెడ్డి, నవంబరు 10 నుండి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
నవంబరు
9న లక్షకుంకుమార్చన, అంకురార్పణ, ఉంటాయన్న టీటీడీ చైర్మన్ 7న కోయిల్ ఆళ్వార్
తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.
10న ధ్వజారోహణం, 14న
గజ వాహనం, 15న స్వర్ణరథం సేవలు
నిర్వహిస్తామన్నారు. 17న రథోత్సవం, 18న పంచమీతీర్థం సేవలు నిర్వహంచి 19న
పుష్పయాగం నిర్వహిస్తామన్నారు.
తిరుమలలో
నవంబరు నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తెలిపారు. నవంబరు 9న మతత్రయ ఏకాదశి, 11న మాస శివరాత్రి, 12న దీపావళి ఆస్థానం, 13న
కేదారగౌరీ వ్రతం, 14న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
15న భగనీహస్త భోజనం, 16న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర, 17న నాగుల చవితి, పెద్ద
శేష వాహనసేవ, నవంబరు 28న శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష
తిరునక్షత్రం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు.