గాజా(gaza)లో హమాస్(HAMAS) మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలను తుడిచివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్
సైన్యం దాడులు చేస్తోంది. వైమానిక, పదాతి దళాలు ఇప్పటి వరకు 450 హమాస్ స్థావరాలపై
దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహతో ఫోన్ లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో
బైడెన్ కీలక సూచనలు చేశారు. హమాస్ మిలిటెంట్లు, సాధారణ ప్రజల మధ్య తేడాలను
గుర్తించాలని కోరారు. అమాయకులు నష్టపోకుండా చూడాలన్నారు. పౌరుల ప్ర్రాణాలకు
రక్షణ కల్పించే మానవతా చట్టాలకు అనుగుణంగా
వ్యవహరించాలన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి
తెరపడాలని ఆకాంక్షించారు.
సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలనే విషయంపై ఇజ్రాయెల్,
అరబ్ దేశాల నాయకత్వం ఆలోచన చేయాలని సూచించారు. ద్విదేశ విధానానికి ప్రాధాన్యం
ఇవ్వాలని కోరారు.
ఖైదీల మార్పిడికి సిద్ధమంటూ హమాస్ ప్రకటించడంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్
స్పందించారు. మానసికంగా తమను బెదిరించే
ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే, బందీలను విడిచిపెట్టేందుకు పలు షరతులు విధిస్తోందన్నారు.