గూఢచర్యానికి పాల్పడ్డారంటూ భారత్‌కు చెందిన 8 మంది నేవీ అధికారులకు (ex navy officers) కతార్ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్న వేళ భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కతార్‌లో వారిని కలిశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ‘‘కతార్ నిర్భంధంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఇవాళ ఉదయం కలిశాను’’ ఈ విషయాన్ని కేంద్రం చాలా తీవ్రంగా తీసుకుందని ఆయన అన్నారు. బాధితుల కుటుంబాల ఆందోళనను మేం అర్థం చేసుకోగలం, వారి విడుదలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు.
బాధితులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎప్పటికప్పుడు వారి కుబుంబ సభ్యులకు తెలియజేస్తామని జైశంకర్ తెలిపారు.
గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 8 మంది మాజీ నేవీ అధికారులకు కతార్ కోర్టు ఉరిశిక్ష విధించింది. కతార్‌లోని ఓ ప్రైవేటు భద్రతా సంస్థలో పనిచేస్తోన్న వీరిని గత అక్టోబరులో అరెస్టు చేశారు. వీరిపై గూఢచర్యం అభియోగాలు మోపారు. దీనిపై విచారించిన కతార్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై భారత్ న్యాయపోరాటానికి దిగింది.