వరల్డ్
కప్ క్రికెట్ (CWC-2023) టోర్నీలో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో
జరిగిన మ్యాచ్ లో భారత్(BHARAT
VS ENG) భారీ
విజయాన్ని సాధించింది. ప్రపంచకప్ సమరంలో వందపరుగుల తేడాతో ఆంగ్లేయులను మట్టి కరిపించారు.
టాస్
ఓడి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు
చేసింది. మూడో ఓవర్ ఆరో బంతికి ఓపెనర్ గా వచ్చిన
గిల్(9) క్లీన్ బౌల్డ్ అవడంతో 27 పరుగుల వద్ద తొలి వికెట్ భారత్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 9 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. శ్రేయస్
అయ్యర్ కూడా నిరాశ పరిచాడు. 16 బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే సాధించాడు. 25
ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టపోయిన భారత్, 100 పరుగులు చేసింది.
30
ఓవర్లు ముగిసే సరికి 131 పరుగులు చేశారు. ఆ తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ ఔట్
అయ్యాడు. డేవిడ్ విల్లే వేసిన బంతిని బెయిర్ స్టోకు క్యాచ్ అందించి పెవిలియన్
చేరాడు. 58 బంతులు ఆడిన రాహుల్ 39 పరుగులు చేశాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన
రోహిత్ శర్మ 87 పరుగుల వద్ద ఔటయ్యాడు. 101 బంతులు ఆడిన రోహిత్, అదిల్ రషీద్ వేసిన
36 ఓవర్ ఐదో బంతికి లివింగ్ స్టోన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రవీంద్ర జడేజా
కూడా నిరాశపరిచాడు. ఆదిల్ రషీద్ వేసిన 40 వ ఓవర్ మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్
అయ్యాడు. దీంతో 180 పరుగుల వద్ద 6 వికెట్లు నష్టపోయింది. 41 ఓవర్ రెండో బంతికి షమీ
కూడా కేవలం ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసిన
సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ విల్లే వేసిన 46 ఓవర్ లో ఔట్ అయ్యాడు. దీంతో 208 పరుగుల
వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జస్పిత్ బుమ్రా (16) రన్ఔట్ కాగా,
కుల్దీప్ యాదవ్(9) పరుగులు చేశారు.
ఇంగ్లండ్
బౌలర్లు డేవిడ్ విల్లే 3, క్రిస్ వోక్స్ 2, ఆదిల్ రషీద్ 2, మార్క్‌వుడ్ 1 వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటాడు. బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2, జడేజాకు ఒక వికెట్ దక్కింది. లియామ్
లివింగ్ స్టన్ ఒక్కరే 27 పరుగులు చేసి టాప్
స్కోరర్ గా ఉన్నారు.
శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్
మధ్య నేడు పూణెలో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సెమీ ఫైనల్ రేసులోకి
వస్తుంది.