వరల్డ్
కప్ క్రికెట్ (CWC-2023) టోర్నీలో భాగంగా 29 వ మ్యాచ్
లో లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్
తలపడుతున్నాయి. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు నిర్ణీత 50
ఓవర్లలో 229 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్
ప్రారంభించారు. తొలి ఓవర్ వేసిన డేవిడ్ విల్లే, మొయిడిన్ చేశారు. రెండో ఓవర్ ను
క్రిస్ వోక్స్ వేయగా శుభమన్ గిల్ ఫోర్ తో
ఖాతా తెరిచారు. మూడో ఓవర్ ఆరో బంతికి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 పరుగుల వద్ద శుభమన్
గిల్ వెనుదిరిగాడు. 27 పరుగుల వద్ద ఒక వికెట్ నష్టపోయింది. అనంతరం క్రీజులోకి
వచ్చిన విరాట్ కోహ్లీ, 9 బంతులు ఆడి డకౌట్
గా వెనుదిరిగాడు. డేవిడ్ విల్లే వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి బెన్ స్టోక్స్ కు క్యాచి
ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశ
పరిచాడు. 16 బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే సాధించాడు. క్రిస్ వోక్స్ వేసిన 11
ఓవర్ ఐదో బంతికి మ్కార్ వుడ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 25 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టపోయిన
భారత్, 100 పరుగులు చేసింది. 30 ఓవర్లు ముగిసే సరికి 131 పరుగులు చేశారు. ఆ తర్వాతి ఓవర్
లో కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు.
డేవిడ్ విల్లే వేసిన బంతిని బెయిర్ స్టోకు క్యాచ్ అందించి పెవిలియన్ చేరాడు. 58
బంతులు ఆడిన రాహుల్ 39 పరుగులు చేశాడు.
66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
87 పరుగుల వద్ద ఔటయ్యాడు. 101 బంతులు ఆడిన రోహిత్, అదిల్ రషిద్ వేసిన 36 ఓవర్ ఐదో బంతికి లివింగ్ స్టోన్ క్యాచ్ ఇచ్చి
వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా కూడా నిరాశపరిచాడు. ఆదిల్ రషీద్ వేసిన 40 వ ఓవర్ మూడో
బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 180 పరుగుల వద్ద 6 వికెట్లు
నష్టపోయింది.
41 ఓవర్ రెండో బంతికి షమీ
కూడా కేవలం ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. 47
బంతుల్లో 49 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ విల్లే వేసిన 46 ఓవర్ లో ఔట్
అయ్యాడు. దీంతో 208 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జస్పిత్ బుమ్రా
(16) రన్ ఔట్ కాగా, కుల్దీప్ యాదవ్(9) పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. నిర్ణీత 50
ఓవర్లలో రోహిత్ సేన 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.
ఇంగ్లండ్
బౌలర్లు డేవిడ్ విల్లే 3, క్రిస్ వోక్స్ 2, ఆదిల్ రషీద్ 2, మార్క్‌వుడ్ 1 వికెట్ పడగొట్టారు.