వరల్డ్ కప్ క్రికెట్ (CWC-2023) టోర్నీలో జరుగుతున్న 29 వ మ్యాచ్ లో లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన భారత్
, తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్
ప్రారంభించారు.
తొలి ఓవర్ వేసిన డేవిడ్ విల్లే, మొయిడిన్ చేశారు. రెండో ఓవర్ ను
క్రిస్ వోక్స్ వేయగా శుభమన్ గిల్ ఫోర్ తో
ఖాతా తెరిచారు. మూడో ఓవర్ ఆరో బంతికి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 పరుగుల వద్ద శుభమన్
గిల్ వెనుదిరిగాడు. 27 పరుగుల వద్ద ఒక వికెట్ నష్టపోయింది.
అనంతరం క్రీజులోకి
వచ్చిన విరాట్ కోహ్లీ, 9 బంతులు ఆడి డకౌట్
గా వెనుదిరిగాడు. డేవిడ్ విల్లీ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి బెన్ స్టోక్స్ కు క్యాచి
ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశ
పరిచాడు. 16 బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే సాధించాడు. క్రిస్ వోక్స్ వేసిన 11
ఓవర్ ఐదో బంతికి మ్కార్ వుడ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 25 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టపోయిన
భారత్, 100 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 57 పరుగులు చేయగా,
కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 30 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ పలు రికార్డులు సృష్టించాడు.
కెప్టెన్ గా 100 వ మ్యాచ్ ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో 18 వేల పరుగులు
సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆయన చేరారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్
గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, (వికెట్ కీపర్), సూర్యకుమార్
యాదవ్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, షమీ, బుమ్రా, సిరాజ్
ఇంగ్లండ్ జట్టు..
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో
రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టన్/వీకెట్ కీపర్), లియామ్ లివింగ్ స్టోన్,
మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.