స్థానికంగా
తయారయ్యే ఉత్పత్తుల కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోదీ(PM MODI) మరోసారి జాతికి పిలుపునిచ్చారు. పండుగల
సమయంలో చిరు వ్యాపారస్తులు, వీధివ్యాపారుల వద్ద వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా
స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు.
మన్
కీ బాత్ సందేశంలో ప్రధాని ఈ మేరకు పిలుపునిచ్చారు. కేవలం పండుగల సమయంలోనే కాకుండా అవసరాలకు
స్థానిక ఉత్పత్తుల కొనుగోలు చేయడం అవసరమని ఉద్ఘాటించారు.
రోజువారీ
అవసరాలకు అవసరమైన అన్నీ వస్తువులు దేశంలోనే దొరుకుతున్నాయన్న ప్రధాని, ఆత్మనిర్భర్
స్వప్నం సాకారంలో భాగంగా స్థానికంగా తయారయ్యే వస్తువుల కొనుగోలుకు ప్రాధాన్యం
ఇవ్వాలని కోరారు. తద్వారా దేశ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఐక్యతా భావం
వర్ధిల్లుతుందన్నారు.
భారత్,
ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారుతోందన్న ప్రధాని, పేరెన్నిక గన్న
కంపెనీలు, తమ ఉత్పత్తులు ఇక్కడే తయారు చేస్తున్నాయని వివరించారు.
ప్రధాని
గతంలో ఇచ్చిన పిలుపు మేరకు ఖాదీ వస్త్రాల కొనుగోలు గణనీయంగా పెరిగింది. గతంలో
విక్రయాలు రూ. 30 వేల కోట్లుగా ఉంది. ప్రధాని పిలుపు తర్వాత విక్రయాలు దాదాపు రూ.
1.25 లక్షల కోట్లకు చేరాయి.
ఖాదీ
అమ్మకాలు పెరిగితే ఆ ప్రయోజనం మన నగరాలతో
పాటు గ్రామాలకు అందుతుందని ప్రధాని మోదీ వివరించారు.
నేత కార్మికులు, హస్త కళాకారులు, కుటీర
పరిశ్రమలు, రైతులకు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం (vocal for the local campaign) క్రమంగా ప్రజలకు నుంచి మద్దతు
పెరుగుతోందన్నారు.