కేరళలోని
కొచ్చి ప్రాంతం(Kalamassery )లో వరుస పేలుళ్ళతో భయానక వాతావరణం ఏర్పడింది.
ఇవాళ ఉదయం యోహోవా సాక్షుల
ప్రార్థనా ప్రదేశం(prayer
meeting) దగ్గర వరుస పేలుళ్ళు(explosions) జరగడంతో
ఒకరు ప్రాణాలు
కోల్పోగా మరికొందరు
తీవ్రంగా గాయపడ్డారు.
కలమసేరి
సీఐ విబిన్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9 గంటలకు మొదటి పేలుడు జరగగా ఆ
తర్వాత గంటల వ్యవధిలో పలు పేలుళ్ళు జరిగాయి. మూడు రోజుల ప్రార్థన కూటమిలో భాగంగా
నేడు ఆఖరి రోజు ప్రార్థనలు జరగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రార్థనలకు
దాదాపు 2 వేల మంది హాజరైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
కేరళలో
జరిగిన ప్రో పాలస్తీనా నిరసన లో హమాస్ ఉగ్రసంస్థ నాయకుడు ఖలీద్ మాషల్, వర్చువల్ గా పాల్గొని ప్రసంగించిన
మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.
హమాస్
అనుకూలంగా నిరసనలు చేపట్టాలని, ఆర్థికంగా సాయపడాలని మాషల్ పిలుపునిచ్చాడని భారత్
లో ఇజ్రాయెల్ రాయభారి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.