వన్డే ప్రపంచకప్(CWC-2023) టోర్నీలో విజయయాత్ర
కొనసాగిస్తున్న భారత(BHARAT) జట్టు నేడు లక్నో వేదికగా
ఇంగ్లండ్(England) తో తలపడనుంది. ఇవాళ బ్రిటీషు జట్టును
ఓడిస్తే నాకౌట్ లో అడుగుపెడుతుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌లో
గాయపడ్డట్టు సమాచారం. కుడిచేయి మణికట్టుకు బంతి బలంగా తాకిందని ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.
లక్నోలో జరగబోయే మ్యాచ్ రోహిత్ శర్మకు
కీలకం. ఈ మ్యాచ్ ఆడితే భారత జట్టు కెప్టెన్‌గా 100వ మ్యాచ్ అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో
18 వేల పరుగులు
సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి రోహిత్ ఇంకా 47 పరుగుల దూరంలోనే ఉన్నాడు.
హాట్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగు
పెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆడిన ఐదు అయిదు మ్యాచ్‌ల్లో
ఒకటే విజయం, అది కూడా బంగ్లాదేశ్‌పై సాధించింది. ఆప్ఘన్, శ్రీలంక లాంటి
చిన్న జట్ల చేతుల్లో ఓడింది.
టోర్నీలో ప్రదర్శన ఎంత పేలవంగా
ఉన్నప్పటికీ.. ప్రపంచకప్ ముందు వరకు అన్ని జట్లనూ భయపెట్టింది. ఒక మ్యాచ్‌లో
అన్నీ కలిసొస్తే ఆ జట్టు ఆటతీరే మారిపోవచ్చు.
ఏక్నా
స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువే. స్పిన్నర్లతో
పాటు పేసర్లూ బాగా ప్రభావం చూపే అవకాశముంది. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్ కు
అనుకూలిస్తుంది.