వన్డే ప్రపంచ కప్ (CWC-2023) టోర్నీలో
నెదర్లాండ్స్(Netherlands) జట్టు మరోసారి సంచలనం నమోదు చేసింది.
87
పరుగుల తేడాతో బంగ్లాదేశ్(Bangladesh) ను
చిత్తు చేసి వరల్డ్‌కప్ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్
చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. స్కాట్ ఎడ్వర్డ్స్(68), వెస్లీ బరెస్సీ(41),
సైబ్రాండ్(35), లొగాన్ వాన్ బీక్(23 నాటౌట్) తో డచ్ ఇన్నింగ్స్ 229 పరుగులకు
ముగిసింది.
బంగ్లాదేశ్
42.2
ఓవర్లలో 142
పరుగులకే కుప్పకూలింది.
మెహదీ హసన్ మిరాజ్ (35; 40 బంతుల్లో 5×4,
1×6) టాప్ స్కోరర్
గా ఉన్నారు. 18వ
ఓవర్లో 70/6తో
బంగ్లా ఓటమి బాటలో పయనించింది. అయితే మెహదీ హసన్ (17)తో కలిసి పోరాడిన మహ్మదుల్లా (20) ఆ జట్టులో ఏ మూలో చిన్న ఆశ రేపాడు.
కానీ డచ్ జట్టు పట్టు వదలకుండా పోరాడింది. మెహదీ హసన్ రనౌట్‌తో 38 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి
తెరపడింది. అప్పటికి స్కోరు 108. కాసేపటికే మహ్మదుల్లాను డి లీడ్ ఔట్
చేశాడు.
నెదర్లాండ్ బౌలర్లు పాల్ వాన్
మీకెరెన్(4/23), బాస్ డీ లీడ్(2/25) బంగ్లా జట్టు పతనాన్ని శాసించారు.
స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్ ఏ మాత్రం పోరాట పటిమ చూపలేకపోయింది. డచ్
బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ వేశారు.
ప్రస్తుతం
ప్రపంచకప్ పోటీల్లో సౌతాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన నెదర్లాండ్స్ తాజాగా
బంగ్లాదేశ్ ను చిత్తుచేసింది. తాజా విజయంతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో
ఇంగ్లండ్ ను చివరిస్థానానికి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.