విద్యుత్ సరఫరాలో ఏర్పడిన లోపంతో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ధర్మవరం తిరుపతి లైన్లో విద్యుత్ రైళ్లు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం మధ్యాహం గం.2.45 నిమిషాలకు అంతరాయం ఏర్పడింది. దాన్ని సవరించడానికి ఐదు గంటల సమయం పట్టడంతో వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ రైలు (Indian Railways) ముదిగుబ్బలో మధ్యాహ్నం గం.2.30 నిమిషాలకు నిలిచిపోయింది. ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ బత్తులపల్లి మండలం చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్ వద్ద మధ్నాహ్నం గం 2.45 నిమిషాలకు నిలిచిపోయింది. రాత్రి 8 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో రైళ్లు కదిలాయి. కనీసం తాగునీరు, ఆహారం కూడా లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.