వన్డే
క్రికెట్ వరల్డ్ కప్(CWC-2023) టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజీలాండ్ లో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా
బ్యాటర్లు చెలరేగారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల
తేడాతో కివీస్ పై ఆసీస్(AUS
VS NZ) నెగ్గింది.
తొలుత
బ్యాటింగ్ గెలిచిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన
ఆస్ట్రేలియా టీమ్ 49.2 ఓవర్లలో 388 పరుగులు భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయ్యింది.
ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 81 పరుగులు
చేయగా, ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో 109 పరుగులు చేశారు.
ఆఖర్లో
మాక్స్వెల్ 24 బంతుల్లో 41 పరుగులు చేయగా, జోష్ ఇంగ్లిన్ 28 బాల్స్ కు 38 రన్స్
చేశారు. పాట్ కమిన్స్ శివాలెత్తాడు. 14 బంతుల్లో 37 పరుగులు రాబట్టాడు. 49.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 388 కి ఆలౌట్
అయ్యారు.
కివీస్
బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ పది ఓవర్లు వేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు
పడగొట్టాడు. బౌల్ట్ 3, సాంటర్న్ 2, మ్యాట్ హెన్నీ, నీషమ్ తలో వికెట్ తీశారు.
ఛేజింగ్
కు దిగిన న్యూజీలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే(28), విల్ యంగ్(32) తొలి వికెట్ కు
61 పరుగులు చేశారు. ఇరువురినీ ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ ఔట్ చేశాడు.
రచిన్ రవీంద్ర 89 బంతుల్లో 116 పరుగులు చేయగా, డేరియల్
మిచెల్ 51 బంతుల్లో 54 పరుగులు చేశాడు. టామ్ లతమ్ 22 బంతుల్లో 21 పరుగులు చేయగా
గ్లీన్ ఫిలిప్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు. జిమ్మీ నీషమ్ 39 బంతుల్లో 58 పరుగులు
చేసి రన్ ఔట్ అయ్యాడు. మిట్చ్ శాంతర్ 17, మాట్ హెన్రీ 9 వద్ద నిష్క్రమించారు. ట్రెంట్
బౌల్ట్ 10, లాకీ ఫెర్గూషన్(0) నాటౌట్ గా ఉన్నారు. నిర్ణీత 50 ఓవర్లలో 383 పరుగులు
మాత్రమే చేయగల్గారు. దీంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా మూడు వికెట్లు
పడగొట్టాడు. హేజిల్‌వుడ్, కమిన్స్ రెండేసి చొప్పున వికెట్లు తీయగా, మాక్స్వెల్ ఒక
వికెట్ తీశారు.