పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త, స్నేహితుడు దర్శన్ హీరానందాని(Darshan Hiranandani)కి ఇచ్చినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా
మొయిత్రా(Mahua
Moitra) అంగీకరించారు.
తాను లోక్‌సభలో అడిగే ప్రశ్నలను టైప్
చేయడానికి వాటిని ఇచ్చినట్లు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ
ఇచ్చారు.
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి
హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు వస్తోన్న ఆరోపణలను ఆమె ఖండించారు. అందుకు
తగిన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
తాను మారుమూల నియోజకవర్గానికి
ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. ‘అయితే
ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుంది. నా ప్రశ్నలు ఎప్పటికప్పుడు పోస్టు అవుతుంటాయి’ అని
చెప్పారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్‌సైట్లను నిర్వహించే
ఎన్‌ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని చెప్పారు.
హీరానందాని(Darshan Hiranandani) తన స్నేహితుడని, ఆయన నుంచి తన పుట్టినరోజున ఒక స్కార్ఫ్, లిప్‌స్టిక్, మేకప్ ఐటెమ్స్‌ను అందుకున్నట్లు ఒప్పుకున్నారు.
దుబాయ్‌లోని పన్నులు లేని ఒక
డ్యూటీ-ఫ్రీ స్టోర్ నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు.
తనకు కేటాయించిన ఇంటి ఇంటీరియర్స్
మార్పు గురించి ఆయన్ను కలిసినట్లు చెప్పారు. ప్రభుత్వం పరిధిలోని సీపీడబ్ల్యూడీ
ఇంటీరియర్ పని పూర్తిచేసిందన్నారు.
‘అఫిడవిట్‌లో నాకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు లేదు. ఒకవేళ నగదు ఇస్తే.. ఆ
తేదీ, అందుకు సంబంధించిన పత్రాలు బయటపెట్టాలి’ అని
డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో పార్లమెంట్‌లో మహువా
అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకొన్నవే ఉన్నాయంటూ కొద్దిరోజుల
క్రితం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వ్యాపార
వేత్త హీరానందాని కూడా మహువాకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. తన వద్ద నుంచి ఆమె
సొమ్ములు తీసుకొందని పేర్కొన్నారు.
వీటికి తోడు లోక్‌సభ సభ్యురాలైన మహువా
పార్లమెంట్ లాగిన్ ఐడీని దుబాయ్‌లోని మరో వ్యక్తి ఉపయోగించారనే ఆరోపణలు కూడా
చెలరేగాయి. దీనిపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. దాని ఎదుట దూబే, మహువా ఒకప్పటి సన్నిహితుడు, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ తమ వాంగ్మూలం
ఇచ్చారు.
అక్టోబర్ 31న తమ ముందు హాజరుకావాలని ఎథిక్స్ కమిటీ
మహువా(Mahua
Moitra)కు సమన్లు ఇచ్చింది. అయితే ముందుగా
నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున తనకు కొంత సమయం కావాలని ఆమె కోరారు. దాంతో ఆమె హాజరుకావాల్సిన తేదీ నవంబర్ రెండుకు
మారింది. ఇంతకు మించి పొడిగింపు ఉండదని ఎథిక్స్ కమిటీ స్పష్టం చేసింది.