కేంద్రప్రభుత్వం
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా(Rozgar Mela) ద్వారా యువతకు పెద్ద
ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దిల్లీలో కేంద్రప్రభుత్వం
ఆధ్వర్యంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో
50 వేల మందికి ఉద్యోగనియామక పత్రాలు(appointment letters
) అందజేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులతో వీడియో
కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధానిమోదీ(PM MODI).. కేంద్రప్రభుత్వ చొరవతో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు
లభిస్తున్నాయన్నారు.
రోజ్గార్
మేళా పథకాన్ని గత ఏడాది అక్టోబర్లో ఎన్డీయే ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దీనిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ
కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందుకున్నారు. దిపావళి పండుగకు ఇంకా సమయం ఉందన్న
ప్రధాని మోదీ, నేడు ఉద్యోగాలు సాధించిన 50 వేల మంది
అభ్యర్థుల
ఇళ్ళలో దీపావళీని మించిన పండుగ వాతావరణం నెలకొందన్నారు.
రైల్వే,
పోస్టల్, గృహ మంత్రిత్వ శాఖ, రెవెన్యూ, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఆరోగ్య, వైద్యశాఖలో
నియమాకాలను ఈ కార్యక్రమం కింద చేపడుతున్నారు.
ఉద్యోగ
కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని మంత్రి నిబద్ధతకు రోజ్గార్ మేళా ఓ ముందడుగు
లాంటిది. యువత సాధికారితకు, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలు
కల్పిస్తుందని ప్రధాని అన్నారు.