స్కిల్
కేసు(SKILL CASE)లు అరెస్టై రాజమండ్రి(RAJAMAHENDRAVARAM) సెంట్రల్ జైలు(CENTRAL PRISON)లో రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CHANDRA BABU) భద్రతపై వెల్లడవుతున్న అనుమానాలపై
జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్(DIG RAVI KIRAN) వివరణ ఇచ్చారు.
జైల్లో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని, తన ప్రాణాలకు హాని
ఉందంటూ చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడంపై స్పందించారు.
లేఖలో పేర్కొన్న అంశాలపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టత
ఇచ్చే ప్రయత్నం చేశారు.
మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్టు పోలీసులు
తమకు సమాచారం అందించారని వెల్లడించారు. దాంతో ఎస్పీ జైలుకు వచ్చి భద్రతా
ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారని తెలిపారు.
ఎస్పీతో కలిసి తానూ చంద్రబాబు భద్రతపై వెరిఫికేషన్ చేపట్టినట్టు
డీఐజీ వివరించారు. 24
గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు.
23 తేదీన డ్రోన్ వంటి వస్తువు ఒకటి జైలు గేటు వద్ద ఎగిరినట్లు గుర్తించినట్టు
వాచ్ టవర్ లోని ఒక గార్డు సమాచారం అందించాడన్నారు. దీనిపై పోలీసులకు అధికారికంగా
లిఖితపూర్వకంగా సమాచారం అందించామని,
చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారని సమాధానమిచ్చారు.
గంజాయి పొట్లాలను కొందరు జైల్లోకి విసిరేశారని కూడా చంద్రబాబు తన లేఖలో
పేర్కొన్నారని, కానీ, ఇప్పటివరకు జైల్లోకి గంజాయి ప్యాకెట్లు విసిరివేయడం జరగలేదని స్పష్టం చేశారు.
మావోల
పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా తేలిందన్నారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ
బయటకొచ్చిన లెటర్‌కు జైలు అధికారుల అటెస్టేషన్ చేయలేదన్నారు.
శ్రీనివాస్
అనే ఖైదీని రిమాండ్‌కు తెచ్చినప్పుడు ఆయన వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్లు గుర్తించామన్నారు.
అయితే, వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీ
చేయగా.. అందులో జైలుకు సంబంధించి ఎలాంటి
ఫుటేజీ లేదన్నారు.
స్వాధీనం
చేసుకున్న కెమెరాను కూడా పోలీసు వారికి అప్పగించామన్నారు. దాన్ని రిమాండ్ ఖైదీ
ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
చంద్రబాబుకు
ఇమ్మెచ్చ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారని, దానికి కొంత సమయం
తర్వాతైనా ఆపరేషన్ చేయించుకోవచ్చని సూచించారన్నారు.
జైల్లో
చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ
జరుగుతుందన్నారు.
రాజమండ్రి
సెంట్రల్ జైలు బయట వైపు 24 గంటలపాటూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో
పకడ్బందీగా వాచ్ జరుగుతుందని రాజమండ్రి ఎస్పీ జగదీష్ తెలిపారు.