వన్డే
క్రికెట్ ప్రపంచ కప్ (CWC) టోర్నీలో భాగంగా పాకిస్తాన్ పై
దక్షిణాఫ్రికా(PAK VS SA) విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి
బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనలో సఫారి జట్టు ఒక వికెట్ తేడాతో పాక్ పై నెగ్గింది.
తాజా
గెలుపుతో సౌతాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకగా, వరుసగా
నాలుగు మ్యాచుల్లో ఓడిన పాక్ జట్టు సెమీస్ అవకాశాలు మరింత అడుగంటాయి.
లక్ష్య
ఛేదనలో సౌతాఫ్రికా జట్టు 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.
ఛేదనను
దక్షిణాఫ్రికా దూకుడుగా మొదలు పెట్టింది. షాహిన్ వేసిన రెండో ఓవర్లో డికాక్ 14
బంతుల్లో 24 పరుగులు చేశాడు. బవుమా 27 బాల్స్ కు 28 రన్స్ రాబట్టారు. వీరితో పాటు
డసెస్(21), క్లాసెస్ (12) నిష్క్రమించారుు.
మార్కరమ్ , మిల్లర్ పరిస్థితిని చక్కదిద్దారు. ఇరువురు ఐదో వికెట్‌కు 70
పరుగులు జోడించారు.
59 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన సమయంలో మార్క్రమ్ అవుట్
కావడంతో మ్యాచ్ కీలక ములపు తిరిగింది.
ఎయిడెన్ మార్క్రమ్ 91 పరుగులు చేసి టాప్‌స్కోరర్
గా నిలిచాడు. ఇతర ఆటగాళ్ళు 30 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయారు.
పాక్
బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది3, హరీస్ రవుఫ్, మహమ్మద్ వసీమ్, ఉసామా మీర్ తలా రెండు
వికెట్లు తీశారు.
టాస్
గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచింది.
ఓపెనర్లు అబ్దుల్లా(9). ఇమామ్(12) సమష్టిగా విఫలమయ్యారు. రిజ్వాన్ 27 బంతుల్లో 31
పరుగులు చేశాడు. ఇఫ్తికార్(21) తక్కువ స్కోరుకే ఔట్ చేసి దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది.
బాబర్ 64 బంతుల్లో అర్ధసెంచరీ చేసి వెనుదిరిగాడు. ఆరో వికెట్‌కు షకీల్‌తో కలిసి 84
పరుగులు జోడించిన షాదాబ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షకీల్ హాఫ్ సెంచరీ చేసి
ఔట్ అయ్యాడు. తదనంతరం 30 పరుగుల వ్యవధిలో పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
20 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయ్యారు. షంసీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
దక్కింది.