వన్డే ప్రపంచ కప్(CWC-2023)
టోర్నీలో భాగంగా చెన్నై ఎమ్ఏ చినస్వామి స్టేడియంలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా(PAK VS SA)
మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్లకు పది
వికెట్లు నష్టపోయి 270 పరుగులు చేసింది.
చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో ప్రత్యర్థి
ముందు 271 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 9 రన్స్
చేసి ఔటయ్యాడు. మార్క్ జాన్సన్ వేసిన
నాల్గో ఓవర్ మూడో బంతికి ఎంగిడీకి క్యాచ్
ఇచ్చి ఔటయ్యాడు. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 38
పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 18 బంతులు ఆడి 12 పరుగుల తీసి పెవిలియన్ చేరాడు.
మార్కో జాన్సన్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి క్లాసిన్ కి క్యాచ్ రూపంలో
దొరికిపోయాడు.
కెప్టన్ బాబర్ అజమ్ 65 బంతుల్లో 50
పరుగులు చేశాడు. మహమ్మద్ రిజ్వాన్ 27 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 15 ఓవర్ 5వ
బంతికి మూడో వికెట్ ను సఫారీ బౌలర్లు పడగొట్టారు.
రిజ్వాన్ నిష్ర్కమించినా ఇఫ్తికార్
అహ్మద్(21)తో కలిసి నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించాడు బాబర్. షంషీ వేసిన 25.1
వ బంతికి క్లాసిన్ కు ఇఫ్తికార్ క్యాచ్
ఇచ్చి ఔటయ్యాడు.
అర్ధసెంచరీ తర్వాత బాబర్ కూడా కీపర్ డికాక్
కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
141 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన
పాకిస్తాన్ ను షకీల్-షాదాబ్ ఆదుకున్నారు. ఆరో వికెట్ కు 71 బంతుల్లో 84 పరుగులు
చేశారు. ఈ జోడీని షంషీ విడగొట్టాడు. తర్వాత అర్థసెంచరీ పూర్తి చేసిన షకీల్ ఔట్
అయ్యాడు. మహ్మద్ నవాజ్ 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మహ్మద్ వాసీమ్ (7), షహీన్
షా అఫ్రిదీ(2) తో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.
దక్షిణాఫ్రికా బౌలర్లు షంషీ 4 వికెట్లు
తీయగా, జాన్సెన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గెరాల్డ్ కోట్టీ 2, ఎంగిడి 1
వికెట్ తీశారు.