Hubble Telescope shot a pic of Constellation Aquila
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు
చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఓ అపురూపమైన ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ చిత్రం
అంతరిక్ష పరిశోధకులను, రోదసీ శాస్త్రవేత్తలను విస్మయానికి గురి చేస్తోంది.
హబుల్ టెలిస్కోప్ ఫొటో తీసిన నక్షత్ర
పుంజాన్ని ‘అకిలా కాన్స్టలేషన్’ అంటారు. అది భూమికి 7200 కాంతిసంవత్సరాల దూరంలో ఉంది. ఫొటోలో
ఉన్న ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు జి35.2-07ఎన్ అని వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలో
భారీ పరిమాణంలో నక్షత్రాలు ఏర్పడే ప్రదేశంగా దాన్ని గుర్తించారు. అక్కడ ఏర్పడే
నక్షత్రాలు ఎంత భారీగా ఉంటాయంటే వాటి జీవితకాలం పూర్తయేసరికి ఆ నక్షత్రాలు
విధ్వంసకర సూపర్నోవాలుగా మారతాయట. అసలు, ఆ నక్షత్రాలు ఏర్పడే సమయంలోనే వాటి
పరిసరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అకిలా కాన్స్టలేషన్ ఫొటోను నాసా తన
ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. హబుల్ టెలిస్కోప్‌లోని వైడ్‌ఫీల్డ్
కెమెరా 3 ఈ ఫొటో తీసింది. ‘‘ఈ ఫొటోలో భారీ నక్షత్రం ఏర్పడుతున్న దృశ్యాన్ని మీరు
చూడవచ్చు. ఈ నక్షత్రరాశి భూమికి 7,200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఫొటోలో
ప్రొటోస్టెల్లార్ జెట్ మనవైపు ప్రసారం అవుతుండడాన్ని గమనించవచ్చు’’ అని నాసా వెల్లడించింది.
ప్రొటోస్టెల్లార్ జెట్ అంటే ఏంటి?
అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడిన నక్షత్రాలను ప్రొటోస్టార్స్ అంటారు. అలాంటి
నక్షత్రాల నుంచి పదార్ధం భారీ పరిమాణంలో వెలువడుతుంటుంది. ఆ పదార్ధం సమాంతరంగా
ఉండే స్తంభాలుగా విస్తరిస్తూ ప్రసరిస్తూ ఉంటుంది. ఆ పదార్ధం బైటకు వెడల్పుగా విచ్చుకున్నట్టుగా
కాకుండా సాపేక్షంగా సరళరేఖల్లా చాలాదూరం ప్రసారమవుతూ ఉంటుంది. ఆ ప్రసారాన్నే
ప్రొటోస్టెల్లార్ జెట్ అంటారు.
ఆ ద్రవ్య ప్రసారం భారీ పరిమాణంలో
జరుగుతున్నప్పుడు అందులోని కణాలు, అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోయి అయనీకరణ
చెందుతాయి. ఆ అయాన్ల ప్రవాహమే అంతరిక్షంలోకి సరళరేఖల్లా ప్రసారమవుతూ ప్రొటోస్టెల్లార్
జెట్‌గా ఏర్పడతాయి.
నాసా ఈ
ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3లక్షల లైక్‌లు వచ్చాయి.
ఈ అద్భుతమైన ఫొటో చూడడానికి ఎంతో అందంగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి.