మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు(CHANDRA
BABU) అరెస్టు
సందర్భంగా సీఐడీ అధికారుల కాల్ డేటా (CDR)వివరాలు
కోరుతూ ఏసీబీ కోర్టు(ACB
COURT)లో దాఖలైన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును
న్యాయమూర్తి రిజర్వు(JUDGEMENT
RESERVED)
చేశారు.
స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రిని
అక్రమంగా అరెస్టు చేశారని, సీఐడీ అధికారులను ఒత్తిడి చేసి అరెస్టు చేయించారని
కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు వాదించారు. అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ
అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారన్నారు.
కాల్
డేటా వివరాలు బయటపడితే కీలకవిషయాలు వెలుగులోకి వస్తాయని వాస్తవాలు ప్రజలకు
తెలుస్తాయని న్యాయమూర్తిని కోరారు.
ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం
విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదించారు.
చంద్రబాబును
అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు
బందోబస్తు ఏర్పాటు చేశారని, వారి నంబర్లు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదన్నారు.
సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టును బట్టే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందన్నారు. కాల్
డేటా వివరాలు బయటపెడితే దర్యాప్తు అధికారులకు వ్యక్తిగత ఇబ్బందులు వస్తాయని,
అందువల్ల పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి
తీర్పును ఈనెల 31కి రిజర్వు చేశారు.
చంద్రబాబు
అరెస్టు అక్రమం అంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అత్యవసర
విచారణకు న్యాయమూర్తి నిరాకరించారు.
టీడీపీ
బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై ఆ
పార్టీ నేత వర్ల రామయ్య హైకోర్టులో రెండు పిటిషన్లు వేయగా, న్యాయమూర్తి ‘నాట్
బీఫోర్ మీ’ అన్నారు.
రాజమండ్రి
జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ తీరు
కుట్రపూరితంగా ఉందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. చంద్రబాబు
ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. ఈ నెల 25న
భద్రతపై చంద్రబాబు లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని
ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు పై ప్రభుత్వం తప్పుడు కేసులు
పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు
సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మూడో రోజుకు చేరుకుంది.
చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను ఆమె ఓదారుస్తున్నారు.
నేడు తిరుపతి జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి, రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో
సూరా మునిరత్నం, ఏర్పేడు మండలం మునగాలపాలెంలో వసంతమ్మ, శ్రీకాళహస్తి రూరల్ మండలానికి
చెందిన పొలి మునిరాజా కుటుంబాలను పరామర్శించారు. టీడీపీ తరఫున ఒక్కో కుటుంబానికి
రూ. 3 లక్షల చెక్కును అందించారు.