ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు అదే ట్రెండ్ కొనసాగించాయి. కొనుగోళ్లకు మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ సాయంత్రానికి 634 పాయింట్ల లాభంతో 63782 వద్ద ముగిసింది. నిఫ్టీ 190 పాయింట్లు లాభపడి 19047 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.24గా కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో 27 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టాలను చవిచూశాయి. ఎస్బీఐ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.