US attacks on Iran troops in Syria
సిరియా తూర్పు ప్రాంతంలో ఇరాన్
మద్దతున్న సాయుధ బలగాలపై గగనతల దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్‌కు
చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాడుకుంటున్న ప్రదేశాలపైనే తాము దాడి
చేసామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.
ఇరాక్, సిరియాలోని అమెరికా స్థావరాలపై
గత కొద్దిరోజుల్లో దాడులు జరిగాయి. వాటికి ప్రతిచర్యగానే ఈ దాడులు చేసినట్లు
ఆస్టిన్ వివరించారు. గాజా-ఇజ్రాయెల్ వివాదానికీ ఈ దాడులకూ సంబంధం లేదని స్పష్టం
చేసారు. తమ దళాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్న సంకేతాలివ్వడానికే ఈ దాడులు
చేసామన్నారు. అమెరికా దళాల మీద జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం కచ్చితంగా
ఉందనీ, వాటిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వెల్లడించారు.
అక్టోబర్ 17 నుంచి అమెరికా దళాలపై 12 దాడులు జరిగాయి. ఈ
దాడుల్లో కొందరు సైనికులు గాయపడ్డారు. ఓ మిలటరీ కాంట్రాక్టరు గుండెపోటుతో
మరణించారు.
అమెరికా,
పశ్చిమాసియాలో మరో 900 మంది సైనికులను మోహరిస్తోంది. ఇప్పటికే
ఆ ప్రాంతంలో రెండు విమాన వాహక నౌకలను మోహరించింది. బుధవారం జోబైడెన్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ‘‘అమెరికా దళాలకు ఎదురొస్తే తగిన రీతిలో
స్పందిస్తామనీ, దానికి సిద్ధంగా ఉండాలనీ హెచ్చరించారు.