దక్షిణ మధ్య రైల్వే(SCR)లోని విజయవాడ
డివిజన్ లో పలు రైలు సర్వీసులు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్ళించారు. భద్రతా
పనుల కారణంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు రాకపోకల్లో
మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
విశాఖపట్నం-విజయవాడ
మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు. విజయవాడ- ఏలూరు- నిడదవోలు మీదుగా నడిచే రైళ్లను విజయవాడ-
గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
అక్టోబర్
30న ఎర్నాకులం-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసును దారి మళ్లించనున్నట్లు
తెలిపారు.
బెంగళూరు-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నవంబర్ 1, 3 తేదీల్లో మళ్లించిన మార్గంలో
నడుస్తుందన్నారు.
ముంబై-భువనేశ్వర్
కోణార్క్ ఎక్స్ప్రెస్
అక్టోబర్
30, నవంబర్ 1,3,4 తేదీల్లో దారి
మళ్లించనున్న నేపథ్యంలో ప్రయాణికులు గమనించాలని కోరారు. ః
ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో స్టాప్
లేదన్నారు. రైళ్ల రాకపోకల్లో మార్పులను ప్రజలు గమనించి సహకరించాలని వాల్తేర్
డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి కోరారు.