హిందూమతాన్ని
వ్యతిరేకించే వారే బీజేపీని వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు అన్నారు.
ప్రజల్లో
దేశభక్తి పెంపొందించే చర్యల్లో భాగంగా ‘నా దేశం-నా భూమి’ కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చిందన్నారు.
ప్రధాని పిలుపు మేరకు ప్రతీగ్రామం నుంచి మట్టి, బియ్యం సేకరించామని ప్రత్యేక రైలు
ద్వారా దిల్లీకి చేరవేస్తున్నామన్నారు.
బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి దిశానిర్దేశం మేరకు రాష్ట్రంలోని 11 వేల
గ్రామాల నుంచి మట్టి సేకరించినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు
గుర్తుగా కేంద్రం అమృతవనాన్ని నిర్మిస్తోందన్నారు.
తిరుమల
తిరుపతి దేవస్థానం బడ్జెట్ నుంచి తిరుపతి పట్టణాభివృద్ధికి ఒక శాతం నిధులు
కేటాయించడాన్ని బీజేపీ వ్యతిరేకించిందన్నారు. బీజేపీ పోరాటంతో ఈ నిర్ణయంపై టీటీడీ
వెనక్కితగ్గిందన్నారు.
టీటీడీ
పాలకమండలి నిర్ణయానికి వామపక్షాలు, బీఆర్ఎస్, ఆప్ మద్దతు పలకడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రప్రభుత్వ
ఖజానా నుంచి పాస్టర్లు, మౌల్వీలకు చెల్లింపులు చేస్తున్నప్పుడు
ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
మజ్లిస్
తో అంటకాగే బీఆర్ఎస్, అవినీతి ఆప్,
చైనా, రష్యాల్లో వానలు పడితే, భారత్లో
గొడుగులు పట్టే వామపక్షాలకు త్వరలో ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
రాష్ట్రప్రభుత్వ
మద్యం పాలసీపై అవకతవకలు ఎత్తిచూపుతున్న బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం
సరికాదని హితవు పలికారు. వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని
హెచ్చరించారు. తమ రాష్ట్ర అధ్యక్షురాలిపై విమర్శలు చూస్తే ఊరుకునేది లేదన్నారు.