మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CHANDRABABU)కు
హైకోర్టులో మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన దాఖలు చేసిన
బెయిల్ పిటిషన్(BAIL
PETITION)
పై విచారణ జరగకుండానే వాయిదా పడింది.
స్కిల్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో
రిమాండ్ లో ఉన్న చంద్రబాబు, బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు
బెయిల్ కు నిరాకరించడంతో ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ
పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకు నేడు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ వెంకట
జ్యోతిర్మయి ప్రతాప నాట్ బిఫోర్ మీ(NOT BEFORE ME) అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు
జడ్జి చెప్పారు.
హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారంటూ చెప్పారు. అయితే వెంటనే
విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విన్నవించుకున్నారు. హైకోర్టు
రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి, ఎవరు విచారణ చేపడతారనే
నిర్ణయం రిజిస్ట్రార్ నిర్ణయానికే వదిలివేశారు.
స్కిల్
కేసులో భాగంగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు, ఏసీబీ కోర్టుకు
లేఖ రాశారు. తన భద్రత, జైల్లో జరుగుతున్న పరిణామాల పై అనుమానాలు వ్యక్తం చేస్తూ
న్యాయమూర్తికి లేఖ రాశారు. జైలు అధికారులు ఆ లేఖను న్యాయమూర్తికి అందజేశారు.
తాను
జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీసి తన ప్రతిష్ఠకు భంగం
కలిగించారని లేఖలో పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు నక్సలైట్లు కుట్రపన్నుతున్నారని
దానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందన్నారు. లేఖ పై
పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదని న్యాయమూర్తికి వివరించారు.
జైలులో
చోటుచేసుకుంటున్న పలు ఘటనలు ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళారు. జైలులోకి
గంజాయి ప్యాకెట్లు విసరడం, అలాగే జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగురవేయడం గురించి లేఖలో
ప్రస్తావించారు. కొంతమంది ఖైదీల కారణంగా తన భద్రతకు ముప్పు పొంచి ఉందని అనుమానం
వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని లేఖలో
ఆవేదన వెలిబుచ్చారు.