‘నా
భూమి-నా దేశం’ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి ఈ నెల 28న అమృత్కలశ్
యాత్ర(Amrit Kalash Yatra) ప్రత్యేక రైళ్ళు(TRAINS) నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
దేశం కోసం జీవితాలు, ప్రాణాలు త్యాగం చేసిన వీరులు, వీరనారీమణులకు నివాళులర్పిస్తూ
దిల్లీలో స్మారకం ఏర్పాటుకు కేంద్రప్రంభుత్వం ఈ ఏడాది ఆగస్టు9న పిలుపునిచ్చింది.
ఈ
కార్యక్రమంలో భాగస్వాములయ్యే వారు మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి,
బియ్యం రాష్ట్ర రాజధానులకు తరలించారు.
వారంరోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. వాటిని
రేపటి నుంచి ఈ నెల 30 లోపు దిల్లీకి తరలిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విజయవాడ,
సికింద్రాబాద్ నుంచి ఈ నెల 28న ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.
విజయవాడ-హజరత్
నిజాముద్దీన్ (07209) ప్రత్యేక రైలు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు విజయవాడ స్టేషన్
నుంచి బయలు దేరనుంది. ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు హజరత్ నిజాముద్దీన్
చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07210) నవంబర్ 1న రాత్రి 11 గంటలకు హజరత్
నిజాముద్దీన్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరనుంది.
సికింద్రాబాద్ నుంచే వెళ్లే రైలు , 28 ఉదయం 10.45
గంటలకు బయలుదేరనుంది. నవంబర్ 1 రాత్రి 11 గంటలకు తిరుగు ప్రయాణం కానుంది.