ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న
దివ్యాంగుల(DISABLED)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో
దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్(RESERVATION) కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
గతంలో ఉన్న మూడు శాతంరిజర్వేషన్ ఒక శాతం
పెంచి నాలుగు శాతం అమలు చేయనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ ఆర్డర్ నంబరు.77 మేరకు ఈ రిజర్వేషన్‌ను
అమలు చేయనున్నట్టు పేర్కొంది.
ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు , చెవిటి, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి
బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాలున్న
వారిని కూడా దివ్వాంగుల జాబితాలో చేర్చారు.
ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై
ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్సైట్లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్
చేసుకోవాలని
APPSC సూచించింది. ఈ ఏడాది రానున్న
నోటిఫికేషన్ల నుంచి అమలు చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు.