వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC)-2023 టోర్నీలో
ఇంగ్లండ్, శ్రీలంక(ENG VS SRILANKA) మధ్య
జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను మరోసారి నిరాశపరిచింది. బ్రిటిష్ జట్టు అత్యంత
చెత్త ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. లంకేయులు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఔరా
అనిపించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న
ఇంగ్లండ్ జట్టు శ్రీలంక బౌలర్ల దెబ్బకు విలవిలలాడింది. ఏ ఒక్కరూ కూడా అర్ధశతకం
దగ్గరకు వెళ్లలేకపోయారు. బెన్ స్టోక్స్ 76 బంతుల్లో 43 పరుగులు చేశాడు. మిగతా
ఆటగాళ్ళు 30 పరుగుల మార్క్ ను దాటలేకపోయారు.
ఓపెనర్లుగా వచ్చిన జానీ బెయిర్ స్టో 31 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
డేవిడ్ మలాన్ 25 పరుగులకే పెవిలియన్ చేరాడు. తొలి వికెట్‌కు 6.3 ఓవర్లలో 45
పరుగులు చేశారు.
మలన్ ను ఏంజెల్ మాథ్యూస్ ఔట్ చేయగా జో రూట్ 10 బంతులు ఆడి మూడు పరుగులకే రన్ ఔట్ అయ్యాడు. కసూన్ రజిత బౌలింగ్ లో బెయిర్ స్టో క్యాచ్ ఇచ్చి
పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ 8 పరుగుల వద్ద లాహిరు కుమార వేసిన బంతిని ఆడి కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
లియామ్ లివింగ్ స్టోన్(1) లాహిరు కుమార్ బౌలింగ్ ఎల్బీడబ్లూ గా విఫలమయ్యాడు.
మొయిన్ అలీ (15) , క్రిస్ వోక్స్
డకౌట్ గా వెనుదిరిగారు. స్టోక్స్ ను
లాహిరు కుమార వెనక్కి పంపగా, ఆదిల్ రషీద్ 32వ ఓవర్ లో రనౌట్ అయ్యాడు. తీక్షణ
బౌలింగ్ లో మార్క్‌వుడ్ స్టంపౌట్ కావడంతో ఇంగ్లాండ్ ఆలౌటైంది.
లాహిరు
కుమార 35 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, కసున్
రజిత 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఏంజెలో మాథ్యూస్ 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు
తన ఖాతాలో వేసుకున్నాడు. మహీశ్ తీక్షణ 21
పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
శ్రీలంక జట్టు:
కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్
కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక.
ఇంగ్లండ్ జట్టు:
జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్
బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్
లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.