దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఇ సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి, 63,148 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. నిఫ్టీ 264 పాయింట్ల నష్టంతో 18857 వద్ద ముగిసింది. గడచిన ఆరు సెషన్లలోనే సెన్సెక్స్ 3279 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 954 పాయింట్లు కోల్పోయింది. ఇవాళ ఒక్క రోజే 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
మహీంద్రా అండ్ మహీంద్రా 4.06 శాతం నష్టపోయింది. బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, హెచ్ఢీఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో భారీ నష్టాలను చవిచూశాయి. యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్, ఎనర్జీ స్టాక్స్ తీవ్ర నష్టాలను చవిచూశాయి.