పారా ఆసియా గేమ్స్(Asian Para
Games 2023
)
లో భారత క్రీడాకారులు రాణించడంపై ప్రధాని
మోదీ(PM MODI) హర్షం వ్యక్తం చేశారు. భారత
క్రీడాకారుల విజయాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పారా ఆసియా గేమ్స్ లో భారత్ క్రీడాకారులు 73 పతకాలు కైవసం
చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
భారత
పారా అథ్లెట్ల గెలుపుతో ప్రతీ భారతీయుడు ఆనందిస్తున్నాడన్నారు. క్రీడాకారులు
నిబద్ధత, పట్టుదల, అచంచల విశ్వాసం స్ఫూర్తిదాయకమన్నారు.
చైనాలో
జరుగుతున్న నాల్గోఆసియా పారాగేమ్స్ లో 73 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు, గత
రికార్డును అధిగమించారు. 2018 జకార్తాలో జరిగిన పోటీల్లో 72 పతకాలు సాధించారు.
ప్రస్తుతం ఆ రికార్డును అధిగమించి విజయాలతో దూసుకెళుతున్నారు.
నేడు నాల్గో రోజు జరిగిన
పోటీల్లో షూటర్ సిద్ధార్థ బాబు స్వర్ణాన్ని సాధించాడు.
R6 మిక్స్డ్ 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్-1 ఈవెంట్లో 247.7 స్కోరు తో రికార్డు సృష్టించాడు.
మహిళల
షాట్పుట్-ఎఫ్ 34 పోటీల్లో భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ సిల్వర్ మెడల్ సాధించింది.
పురుషుల డబుల్స్ ఆర్చరీ విభాగంలో అదిల్ మోహమెద్, అన్సారీ, నవీన్ దలాల్ బ్రాంజ్
సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో సుకంత్ కదమ్ కాంస్యం సాధించాడు.
పురుషుల
షాట్పుట్ పోటీల్లో సచిన్ ఖలారి గోల్డ్ మెడల్ సంపాదించాడు.
కాంపౌండ్ ఓపెన్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్ లో
భారత్ స్వర్ణం సొంతం చేసుకుంది. భారత్ అథ్లెట్లు రాకేశ్ కుమార్, శీతల్ దేవి విజయం
సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు భారత్ 18 స్వర్ణాలు
సాధించింది.
భారత్ ఇప్పటివరకు 80 పతకాలు సాధించగా అందులో 18 స్వర్ణాలు, 23 రజతాలు, 39 కాంస్య పతకాలు ఉన్నాయి.