ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూళ్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్ నుంచి 4 బిజినెస్ స్కూళ్లు స్థానం దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్
(QS World University Global 2024) ప్రకటించిన ర్యాంకింగ్ జాబితాలో భారత్ నుంచి 4 బిజినెస్ స్కూళ్లు స్థానం పొందాయి. ప్రపంచ స్థాయిలో బిజినెస్ స్కూళ్లు అందించే కోర్సులు, సౌకర్యాలు, టీచింగ్ వంటి అంశాలను పరిశీలించి క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ ఏటా ఈ జాబితాను రూపొందిస్తోంది.
తొలి 100 బిజినెస్ స్కూళ్లలో బెంగళూరు ఐఐఎం 48వ ర్యాంకు సాధించింది. భారత్ నుంచి గత ఏడాది టాప్ ర్యాంకులో నిలిచిన అహ్మదాబాద్ ఐఐఎం ఈ ఏడాది 53వ ర్యాంకుకు పడిపోయింది. ఐఐఎం కోల్‌కతా 59, ఐఎస్బీ 78వ స్థానంలో ఉన్నాయి. గత ఏడాది జాబితాలోనూ ఈ నాలుగు బిజినెస్ స్కూళ్లు టాప్ 100లో స్థానం దక్కించుకున్నాయి. ఐఐఎం లక్నో, ఐఐఎం ఇండోర్, ఐఐఎం ఉదయ్‌పూర్ బిజినెస్ స్కూళ్లు 150 నుంచి 200 మధ్య స్థానాల్లో నిలిచాయి. ఎండీఐ గుర్గావ్, ఐఐఎం ఢిల్లీ ఎక్స్ఎల్ఆర్ఐ స్కూళ్లు 2001 నుంచి 250 మధ్య నిలిచాయి.
క్యూఎస్ జాబితాలో ఈ ఏడాది కూడా అమెరికా బిజినెస్ స్కూళ్లు అగ్ర స్థానంలో నిలిచాయి. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ ఎంబీఏ స్కూల్ ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ సాధించింది. ది వార్డన్ స్కూల్ ద్వితీయ స్థానంలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తృతీయ స్థానంలో నిలిచాయి.