అసెంబ్లీ
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజస్థాన్(RAJASTHAN ) కాంగ్రెస్( CONGRESS)
ను పేపర్ లీక్(PAPER LEAK
) కేసు
వెంటాడుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సహా ఇతర ముఖ్యనేతల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్
డైరక్టరేట్(ED) సోదాలు నిర్వహిస్తోంది. సీనియర్ టీచర్
సెకండరీ గ్రేడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2022 పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్
ఛీప్ గోవింద్ సింగ్ డోటాసరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులకు
క్వశ్చన్ పేపర్ ను రూ. 10 లక్షలకు అమ్ముకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
నేడు ఆయన నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు
చేస్తున్నారు. మరో 12 ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు చేస్తోంది. ఈ నెలలో
అంతకు మునుపు కూడా ఈడీ రైడ్స్ చేసింది. పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న
దినేశ్ ఖోదనియా, అశోక్ కుమార్ జైన్, స్పృధా చౌదరి, సురేశ్ ఢాకా సహా పలువురి నివాసాల్లో
తనిఖీలు నిర్వహించి రూ. 24 లక్షల నగదుతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లు, ఇతర సేల్
డీడ్ల డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ కు ఈడీ
సమన్లు జారీ చేసింది.
నవంబర్ 25న రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న సమయంలో ఈడీ సోదాలు
చేయడం కాంగ్రెస్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు
కేంద్రం ఈడీని ప్రయోగించిందని రాజస్థాన్ సీఎం గహ్లోత్ ఆరోపిస్తున్నారు.