అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63557 వద్ద మొదలైంది. నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18966 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.20 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 (Sensex 30)లో టాటా మోటార్స్, బాజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నాడు భారీ నష్టాలతో ముగియడం, ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగివచ్చింది.బుధవారం విదేశీ పెట్టుబడిదారులు రూ.4327 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు. దేశీయ పెట్టుబడిదారులు రూ.3569 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.