అమెరికాలోని లెవిస్టన్ మైనీలో బుధవారం సాయంత్రం ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. లెనిస్టిన్ సమీపంలోని బౌలింగ్ ఎలే వద్ద, మరో ప్రదేశంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్లు
సిటీ కౌన్సిలర్ రాబర్ట్ కార్టీ తెలిపారు. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
కాల్పులకు తెగబడ్డ దుండగుడి ఫోటోలను స్థానిక పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దుండగుడు బౌలింగ్ ఎలే లోపల ఆటోమేటెడ్ గన్‌తో కాల్పులకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడి ఫోటోతోపాటు, అతను వాడిన కారు ఫోటోలను కూడా పోలీసులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
దుండగుడిని, అతని కారుని గుర్తించిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గం. 7:15 నిమిషాలకు దుండగుడు కాల్పులకు (mass shooting in america ) దిగినట్లు స్థానికుల సమాచారం ద్వారా తెలుస్తోంది. దాదాపు 50 నుంచి 60 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కచ్ఛితమైన సమాచారం అందాల్సి ఉంది.