వన్డే
వరల్డ్కప్ (CWC-2023)చరిత్రలో ఆస్ట్రేలియా దెబ్బకు పసికూన నెదర్లాండ్స్
దారుణంగా ఓడింది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో 309 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 40 బంతుల్లో సెంచరీ
చేసి రికార్డు సృష్టించాడు. మాక్స్వెల్కు డేవిడ్ వార్నర్ సెంచరీ కూడా తోడవడంతో
ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందుంచింది.
400 పరుగులు ఛేదన లో నెదర్లాండ్స్ ఏ మాత్రం పోరాట పటిమ
చూపలేకపోయింది. స్కోరు వంద కూడా దాటకుండానే అవుటైంది.
జట్టులో కేవలం ఐదుగురు మాత్రమే రెండంకెల సంఖ్యలో
పరుగులు చేయగలిగారు. విక్రమ్ జిత్ సింగ్(25), అకర్మన్(10), బాస్ డీ లీడ్(4),
సిబ్రండ్(11) పెవిలియన్ కు వరుస కట్టారు. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(12 నాటౌట్), తేజ నిడమానూరు(18) తో కలిసి ఆరో వికెట్ కు
22 పరుగులు చేశారు. తేజను మిచెల్ మార్ష్ ఔట్ చేయగా, తర్వాత వచ్చిన ఇద్దరు
బ్యాటర్లు లొగాన్ వాన్ బీక్, వాన్డెర్ మెర్వ్ పరుగులు ఏమీ చేయకుండానే ఔట్
అయ్యారు. వాన్డెర్ మెర్వ్ చివరి వికెట్ గా వెనుదిరగడంతో డచ్ జట్టు 90
పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో జంపాకు 4 వికెట్లు పడగా, మార్ష్
2 వికెట్లు తీశాడు. స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్ కు తలా ఒక వికెట్ దక్కింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్
జట్టు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్
డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. గ్లెన్
మాక్స్వెల్ 44 బంతుల్లో 106
పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆసీసీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు
నష్టపోయి399 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 4,
బాస్ డీ లీడే 2 వికెట్లు పడగొట్టారు. ఆర్యన్ దత్ కు ఒక వికెట్ దక్కింది.