వన్డే
ప్రపంచ కప్ (CWC-2023) టోర్నీలో భాగంగా దిల్లీ వేదికగా
ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ (AUS VS NED) తలపడుతున్నాయి. టాస్
గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగన ఆస్ట్రేలియాకు
ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. మిచెల్ మార్ష్
(9) విఫలమయ్యాడు. తొలి వికెట్‌కు వార్నర్ – మార్ష్ 28 పరుగులు మాత్రమే చేశారు.
అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్మిత్.. వాన్ మీకెరెన్ వేసిన ఏడో ఓవర్లో రెండు బౌండరీలు
బాదాడు. వాన్ బీక్ వేసిన పదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. స్మిత్‌తో పాటు వార్నర్ కూడా నిలకడగా ఆడటంతో కంగారూల స్కోరు బోర్డు
పరుగులెత్తింది. విక్రమ్‌జిత్ సింగ్ వేసిన 18వ ఓవర్లో వార్నర్ సిక్స్, ఫోర్ బాది 40 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి
చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే స్మిత్ కూడా 48 బంతుల్లో అర్ధ శతకం చేశాడు.
బాస్ డీ లీడే వేసిన 23వ ఓవర్లో స్మిత్.. సిక్స్, ఫోర్‌తో 70లలోకి చేరాడు. కానీ
ఆర్యన్
దత్ వేసిన 24వ ఓవర్లో మూడో బంతికి వాన్ డెర్ మెర్వ్ చేతికి
చిక్కాడు. దీంతో వార్నర్‌తో కలిసి స్మిత్.. 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 26 ఓవర్ల ఆట ముగిసేసమయానికి వార్నర్ (80), లబూషేన్ (10) పరుగులు చేశారు. 40 ఓవర్లు
ముగిసే సరికి స్మిత్ 71 పరుగులు చేయగా, లబూషేన్ 62 రన్స్ చేశారు. ఐదు వికెట్ల
నష్టానికి ఆసీస్ 266 పరుగులు చేసింది.
ఆల్ రౌండర్ గ్లెస్ మాక్స్వెల్ చెలరేగాడు. డచ్ బౌలర్లను ఓ ఆట
ఆడుకున్నాడు. 44 బంతుల్లో 106 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. నిర్ణీత 50
ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆసీస్ 399 పరుగులు చేసింది. నెదర్లాండ్ బౌలర్లలో బస్ డీ లీడ్ నాలుగు వికెట్లు తీశాడు.