బంగ్లాదేశ్
తీరాన కేంద్రీకృతమైన హమూన్ తుఫాన్(HAMOON CYCLON), గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది.
బలహీనపడి
అల్పపీడనంగా మారుతోంది.
బంగ్లాదేశ్ కు ఆగ్నేయంగా, మిజోరాం అనుకుని ఉంది.
బంగ్లాదేశ్ రాజధాని చిట్టగాంగ్ కు 60 కిలోమీటర్ల దూరంలో, మిజోరాం కు 160
కిలోమీటర్ల దూరంలో తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆరుగంటల పాటు ఉత్తర దిశగా ప్రయాణిస్తూ క్రమంగా
బలహీనపడుతుందని బారత వాతావరణ శాఖ(IMD)
పేర్కొంది.
నిన్న
నైరుతి బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 & 3.1 కి.మీ.ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్
తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది.