మాజీ
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal
Reddy) మరోసారి పార్టీ
మారుతున్నారు. గతంలో కాంగ్రెస్ను వీడి బీజేపీ(BJP)లో
చేరిన కోమటిరెడ్డి, నేడు బీజేపీకీ రాజీనామా చేశారు. మళ్లీ కాంగ్రెస్(CONGRESS) గూటికే చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు ఆయన పార్టీ మారడంపై విమర్శలు
వ్యక్తం అవుతున్నాయి.
గత
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన
రాజగోపాల్ రెడ్డి, శాసనసభ్యత్వాన్ని వదులుకుని బీజేపీలో చేరారు. కమలం గుర్తుపై ఉప
ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడారు. అప్పటి నుంచి ఆయన బీజేపీకి
దూరం జరిగారు.
ఇటీవల తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన సమయంలో కూడా ఆయన
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్
లో ఉండటంతో పాటు రాజకీయప్రస్థానం మొదలు పెట్టిన కాంగ్రెస్ గూటికే మళ్ళీ చేరుతున్నారని
స్థానికులు భావిస్తున్నారు.
అయితే
గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బహిరంగ
విమర్శలు గుప్పించిన రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు ఆయన నాయకత్వంలో మళ్ళీ పనిచేయడానికి
సిద్ధం కావడం విమర్శలకు దారి తీస్తుంది.
ఉమ్మడి
నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి కుటంబానికి ప్రముఖ స్థానం ఉంది.
తెలంగాణలోని ధనిక రాజకీయ నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు.