మన్యంలో
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. చలిగాలులతో పాటు
ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. దీంతో పర్యాటకులు పెద్ద
సంఖ్యలో తరలివస్తున్నారు.
వనజంగి
వ్యూ పాయింట్, లంబసింగి(Lambasingi) ప్రాంతాలకు సందర్శకులు(Tourists) క్యూ కట్టడంతో ఆ ప్రాంతాల్లోని కాటేజీలు నిండిపోయాయి.
సుమారు
150 కాటేజీలు నిండిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ఏటా
కార్తీక మాసంలో కనిపించే వాతావరణం ఈ సారి ముందే వచ్చేసినట్లు స్థానికులు
చెబుతున్నారు. మంగళవారం ఉదయం వనజంగి ప్రాంతానికి దాదాపు 5 వేల మంది పర్యాటకులు వచ్చారు.
రాత్రికి కాటేజీల్లో బస చేసి ఉదయమే
సూర్యోదయాన్ని వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
సముద్ర మట్టానికి 3,400
అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది.
విశాఖపట్నం
నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు
ప్రయాణిస్తే పాడేరు చేరుకోవచ్చు. బొర్రా గుహల వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది.
మంగళవారం నాడు సుమారు 4 వేల మంది సందర్శించారు.
పొగమంచు
దట్టంగా కురవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. పాడేరు మండలం మినుములూరులో 16
డిగ్రీలు, అరకు లోయలో 16.4 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు
నమోదు అయ్యాయి.