చైనా
లోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న నాల్గో పారా ఆసియా గేమ్స్(ASIAN PARA GAMES) లో భారత(BHARAT) ఆటగాళ్ళు సత్తా చూపుతున్నారు. ఇవాళ
మూడో రోజు జరుగుతున్న పోటీల్లో పతకాలు కైవసం చేసుకుని రికార్డులు సృష్టించారు.
పురుషుల
జావెలిన్ త్రో-ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంతిల్ (SUMIT ANTIL), పుష్పేంద్ర సింగ్ పతకాలు సొంతం చేసుకున్నారు. ఆసియా పారా గేమ్స్
రికార్డును బద్దలు కొట్టిన ుమిత్, 73.29 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. మూడో
ప్రయత్నంలో ఈ ఘనత సాధించిన సుమిత్, స్వర్ణ పతకాన్ని(GOLD MEDAL) భారత్ ఖాతాలో చేర్చాడు. పుష్పేంద్ర
సింగ్(PUSHPENDRA SINGH), 62.06 మీటర్ల దూరం బల్లెం విసిరి కాంస్య పతకం గెలిచాడు.
శ్రీలంక
క్రీడాకారుడు సమిత 62.42 మీటర్లతో రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజా
విజయాలతో భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానం ఉండగా, ఇప్పటి వరకు 36 పతకాలు తన ఖాతాలో
వేసుకుంది. వీటిలో 10 స్వర్ణాలు, 12 సిల్వర్, 14 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొదటి రోజు పోటీల్లో 17 పతకాలు గెలిచిన భారత
క్రీడాకారులు, ఆరు స్వర్ణాలు, మరో ఆరు సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ గెలిచారు.
నాలుగో
విడత ఆసియా గేమ్స్‌లో భారత్ నుంచి 303 క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇందులో 191
మంది పురుషులు, 112 మంది మహిళలు ఉన్నారు.
2018
లో జరిగిన ఆసియాన్ పారా గేమ్స్ పోటీల్లో భారత్ తరఫున 190 క్రీడాకారులు పాల్గొని,
72 పతకాలు సాధించారు. వీటిలో 15 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.