వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ (Hamoon)తుఫాను, ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా హమూన్ తుఫాను గంటకు 18కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతోందని ఐఎండి వెల్లడించింది.
ఇవాళ తెల్లవారుజామున హమూన్ తీవ్ర తుఫానుగా మారింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 210కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 270 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు 350కి.మీ దూరంలో హమూన్ తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండి తెలిపింది.
హమూన్ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అక్టోబరు 25 మధ్యాహ్నానికి ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశ ముందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. ఒడిషాలో హమూన్ తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రెవెన్యూ యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు.