క్రికెట్ ప్రపంచ కప్ (CWC-2023)లో
ఆప్ఘనిస్తాన్(Afghanistan) జట్టు మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత గడ్డపై
జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌ను ఆప్ఘన్(PAKISTAN VS Afghanistan
) ఓడించింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన పో రులో
ఆప్ఘన్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి, 8 వికెట్ల తేడాతో
పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదుచేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది.
ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది.
283 పరుగుల ఛేదన లో
ఆఫ్ఘన్ బ్యాటర్లు అదరగొట్టారు.
ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్
తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించారు. రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా
షాహిది మిగతా పని పూర్తి చేశారు.
రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం
జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు.
ఈ ఇరువురు ఔటైన తర్వాత రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది
మరో వికెట్ పడకుండా జట్టును విజయం వైపు నడిపించారు.
రహ్మత్ షా 84 బంతుల్లో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశాడు.
పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది , హసన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.
వన్డే క్రికెట్లో
పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్థాన్ కు ఇదే మొదటి విజయం.